'హ్యాపీ హోలీ' అంటున్న కమలా హారిస్
- March 29, 2021
వాషింగ్టన్ : హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రంగుల పండుగను జరుపుకోవడంపై ఇతర దేశాలలో కూడా ఉత్సాహం చూపుతున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రంగుల పండుగ సందర్భంగా తేడాలను మరచిపోయి కలిసి సాగుదాం అని ఒక వీడియో సందేశంలో కమలా హారిస్ పేర్కొన్నారు. ఈ పండుగ సానుకూలతకు ప్రతీక అని కూడా ఆమె అన్నారు.
‘హ్యాపీ హోలీ! ప్రియమైనవారికి వర్తించే శక్తివంతమైన రంగులకు ప్రసిద్ది చెందింది. ఆనందంతో నిండిన హోలీ అందరికీ అనుకూలతకు చిహ్నంగా ఉన్నది. హోలీ రంగుల్లో మాదిరిగానే మనం కూడా తేడాలను మరచిపోయి కలిసి సాగుదాం అంటూ ఎంతో అర్ధమున్న శుభాకాంక్షలను కమలా హారిస్ తన వీడియో సందేశం ద్వారా తెలిపారు.
హోలీ శుభ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు భారత ప్రజలకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాడు ట్విట్టర్లో ఒక వీడియోను స్కాట్ మోరిసన్ షేర్ చేశారు.
మరోవైపు, పొరుగు దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా హోలీ పర్వదినం సందర్భంగా హిందూ సమాజాన్ని అభినందించారు. ‘రంగుల పండుగ అయిన హోలీ సందర్భంగా మా హిందూ సమాజానికి శుభాకాంక్షలు’ అని ఇమ్రాన్‌ఖాన్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
తాజా వార్తలు
- Dubai Sports Council launches Annual Sports Events Calendar
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







