కరోనా సెకండ్ వేవ్..చిన్నపిల్లలపై కరోనా పంజా
- March 29, 2021
బెంగళూరులో చిన్నపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలోనే ఎక్కువగా బయటపడ్డ కరోనా.. సెకండ్ వేవ్‌లో రూటు మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు పెద్ద వయసు వారితోపాటు చిన్నారుల్లో కూడా కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 1 నుంచి బెంగళూరులో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 472 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. అందులో 244 మంది బాలురు, 228 మంది బాలికలు ఉన్నారు. మార్చి మొదటి వారంలో చిన్న పిల్లల్లో రోజుకు 10 కేసులు వరకు నమోదవగా.. రెండు రోజులుగా అవి విపరీతంగా పెరిగిపోయాయి. మొన్న ఒక్క రోజే 46మంది చిన్న పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు.
గతంలో మాదిరిగా కాకుండా సిటీలో పిల్లలు ఇప్పుడు బహిరంగంగా బయట తిరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. లాక్‌డైన్ ముగిసి పరిస్థితులు సద్దుమణగడంతో కొన్ని తరగతుల వారికి స్కూల్స్ తిరిగి తెరిచారు. దీంతో చాలా మంది స్కూలుకు వెళ్లడంతో పాటుగా ఇంటి పక్కనుండే చిన్నారులతో ఆటలాడుడూ వైరస్‌ను స్ప్రెడ్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. పెద్ద వారు ఉద్యోగాలకు వెళ్లడం, బహిరంగ ప్రదేశాల్లో మార్గదర్శకాలు పాటించకుండా తిరుగుతుండటంతో వారి నుంచి చిన్నారులకు వైరస్ సోకుతోందనే వాదన కూడా ఉంది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







