‘ఆచార్య’ ప్రోమో సాంగ్ విడుదల
- March 30, 2021
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. తొలి పాటను మార్చి 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. లాహే లాహే అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను ఒక్కరోజు ముందుగానే రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ అనగానే చాలా వరకు డాన్సులు, కామెడీ ఉండవని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్న క్రమములో మెగాస్టార్ సర్‌ప్రైజ్ చేశారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









