రక్తదానం కోసం బస్సు ప్రారంభం

- March 31, 2021 , by Maagulf
రక్తదానం కోసం బస్సు ప్రారంభం

దుబాయ్: రక్తదాన ప్రాముఖ్యాన్ని చాటి చెప్పేలా క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన బస్సుని ప్రారంభించారు. రక్త దాతల నుంచి రక్తాన్ని సేకరించేందుకు వీలుగా అన్ని సౌకర్యాలనూ ఇందులో పొందుపరిచారు. కోవిడ్ 19 ప్రికాషన్స్ తీసుకుంటూనే, 300,000 మంది కమ్యూనిటీ మెంబర్స్ వున్న ప్రాంతాలకు వెళ్ళి వారి నుంచి రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. సిటీ వాక్, ది బీచ్, లామెర్, బ్లూ వాటర్స్, లాస్ట్ ఎక్జిట్ అల్ ఖవనీజ్,లాయెన్, బోక్స్ పార్క్, ముడాన్, ది విల్లా, షరూక్, ఘరూబ్, రమరామ్, అల్ ఖయిల్ గేట్, జుమైరా ఎమిరేట్స్ టవర్స్, బర్షా హైట్స్ అలాగే ఎగ్జిక్యూటివ్ టవర్స్ (బిజినెస్ బే వద్ద) ప్రాంతాల్లో ఈ బస్సు రక్త దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com