కొత్త శిక్షణ వేదిక ప్రారంభం

- March 31, 2021 , by Maagulf
కొత్త శిక్షణ వేదిక ప్రారంభం

మస్కట్: మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, కొత్త వ్యక్తిగత లైసెన్సు సర్వీసులను అలాగే ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ వేదికను ప్రారంభించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేసన్ ఆన్ లైన్ వేదికగా ఓ ప్రకటన చేసింది. మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ రహ్మా బింట్ ఇబ్రహీం అల్ మహ్రౌకియా, వ్యక్తిగత లైసెన్సులు అలాగే శిక్షణ నిమిత్తం ఎలక్ట్రానిక్ వేదికను మస్కట్ హాల్ - మినిస్ట్రీ జనరల్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా టాలెంట్ వున్న ఒమనీయులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, వ్యక్తుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేలా చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ శిక్షణకు సంబంధించి రియల్ డేటా బేస్, పోటీ తత్వం పెంచడం, వంటి కీలక వ్యవహారాలకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది. స్థానిక అంతర్జాతీయ సంస్థల్ని ప్రైవేటు సెక్టార్ ద్వారా అనుసంధానం చేయడానికి కంపెనీలను ఆకర్షించడానికి వీలుగా దీన్ని తీర్చిదిద్దారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com