IATA కీలక ప్రకటన..

- March 31, 2021 , by Maagulf
IATA కీలక ప్రకటన..

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(IATA) బుధవారం కీలక ప్రకటన చేసింది. డిజిటల్ ట్రావెల్ పాస్‌ల కోసం ఓ యాప్‌ను రూపొందించినట్టు వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుతం అది ప్రయోగ దశలో ఉన్నట్టు పేర్కంది.కోవిడ్-19 పరీక్ష ఫలితాలు, వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లకు సంబంధించిన డిజిటల్ ట్రావెల్ పాస్ యాప్‌ను ఆపిల్ ప్లాట్‌ఫాంపై ఏప్రిల్ మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫాంకు సంబంధించిన వెర్షన్ ఏప్రిల్ చివరి నాటికి అందుబాటలో ఉంటుందని పేర్కొంది.IATA ఆఫ్రికా,మిడిల్ ఈస్ట్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ కమిల్ అలవాధి మాట్లాడుతూ.. విమానయాన సంస్థలు, వివిధ దేశాలు, విమానాశ్రయాలు దీనిని ఆమోదిస్తేనే దానికి సార్థకత ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ ట్రావెల్ పాస్ యాప్‌కు బార్బడోస్ దేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో లండన్-బార్బడోస్ రూట్‌లో ఏప్రిల్ 16 దీన్ని పరీక్షించిన్నట్టు బ్రిటన్‌కు చెందిన వర్జీనియా అట్లాంటిక్ విమానయాన సంస్థ వెల్లడించింది. IATA తన ట్రావెల్ పాస్ చెక్-ఇన్లను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com