పిల్లకు మా వ్యాక్సిన్ సురక్షితం: ఫైజర్
- April 01, 2021
వాషింగ్టన్: ఫైజర్ దాని భాగస్వామ్య జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌లు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ చిన్నారులకూ సురక్షితమేనని ప్రకటించాయి. ఇదేవిధంగా టీకాను తయారు చేసిన పలు కంపెనీలు చిన్నారులను వైరస్ నుంచి కాపాడేందుకు తమ టీకాలు సురక్షితమని పేర్కొంటున్నాయి. ఆరు నెలల చిన్నారుల విషయంలోనూ తాము రూపొందించిన టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయని చెబుతున్నాయి.
కాగా చిన్నారులు కరోనా బారిన పడితే అది వారికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుందని, అందుకే వారికి టీకాలు వేయడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. టీకాలు ఉత్పత్తి చేసిన పలు కంపెనీలు కూడా తమ టీకాలను పిల్లలకు వేసేందుకు ఆయా ప్రభుత్వాల నుంచి అనుమతులను కోరుతున్నాయి. కాగా ఫైజర్, మోడెర్నా కంపెనీలు చిన్నారులపై టీకా ప్రభావాన్నితెలుసుకునేందుకు పరిశోధనలు ప్రారంభించనున్నాయి. ఇందుకు ఆయా కంపెనీలు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పొందాయి. ఇదేవిధంగా ఆస్ట్రాజెనికా కంపెనీ గత నెలలోనే తమ టీకా చిన్నారులపై ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు పరిశోధనలు ప్రారంభించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







