ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా కళింగరత్న పురస్కారం అందుకున్న ఏపీ గవర్నర్
- April 02, 2021
కటక్:చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేకమైన చొరవతీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.పుస్తక పఠనం విద్యార్థుల మేధోవికాసానికి బాటలు వేస్తుందన్నారు.ఒడిశాలోని కటక్‌లో శుక్రవారం జరిగిన ఆదికవి సరళాదాస్ 600వ జయంత్యుత్సవాల్లో ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రధేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎపి గవర్నర్ హరిచందన్ ను ఉపరాష్ట్రపతి కళింగ రత్న పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా వెంకయ్య నాయిడు మాట్టాడుతూ సరళాదాస్ ఒడియాలో విరచించిన మహాభారతానికి ఇన్ని శతాబ్దాలయినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదరణ అమూల్యమన్నారు. స్థానిక భాషలో, సరళమైన పదజాలంతో ప్రజలకు అర్థమయ్యేరీతిలో జరిగే రచనలకు ఇదొక చక్కటి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

‘కళింగరత్న’ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. పురస్కారం అందుకున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ మాట్లాడుతూ చిన్నారుల ఆసక్తులకు అనుగుణంగా పున్తక రచన సాగాలన్నారు. మాతృభాషలో నేర్చుకున్నదేదీ మరవలేమని, చిరు ప్రాయంలో జరిగే అమ్మభాష బోధన వారి మనో వికాసానికి మార్గం చూపుతుందని వివరించారు.సరళాదాస్ ఆదికవిగా సాహిత్యాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో అందించేందుకు కృషిచేసిన మహనీయుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, అచార్య గణేశ్ లాల్, సరళసాహిత్య సంసద్ అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ స్వాయి సహా పలువురు ఒడియా కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!







