యూఏఈ:ఆరు నెలల వీసా.. అర్హులు ఎవరంటే?
- April 03, 2021
యూఏఈ:గోల్డెన్ రెసిడెన్సీ దరఖాస్తుదారుల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ ఆరు నెలల గడువుతో వీసా సర్వీసును తీసుకొచ్చింది.ఈ వీసా మల్టీపుల్ ఎంట్రీకి కూడా వీలు కల్పిస్తుంది. గోల్డెన్ రెసిడెన్సీకి సంబంధించిన అన్ని విధానాలను పూర్తి చేయడానికి వీలు కల్పించే ఉద్దేశంతో యూఏఈ ఈ 6 నెలల వీసా సేవకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఇది చాలాసార్లు ప్రయాణించే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.ఇక ఈ వీసా ఖరీదును 1150 దిర్హాములుగా అథారిటీ నిర్ణయించింది.కేవలం గోల్డెన్ రెసిడెన్సీ విధానాన్ని పూర్తి చేసే కారణంతో తీసుకొచ్చిన ఆరు నెలల వీసాకు ఎవరు అర్హులంటే..
1. ప్రభుత్వ పెట్టుబడులు లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు
2. వ్యవస్థాపకులు
3. వైద్యులు, శాస్త్రవేత్తలు
4. ఆవిష్కర్తలు
5. పీహెచ్డీ హోల్డర్స్
6. అథ్లెట్స్
7. సంస్కృతి, కళలో సృజనాత్మక నిపుణులు
8. ప్రాధాన్యత గల శాస్త్రీయ రంగాలలోని నిపుణులు
9. ఇంజనీరింగ్, సైన్స్ నిపుణులు (ఎపిడెమియాలజీ మరియు వైరస్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్, ఎలక్ట్రికల్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ)
10. అత్యుత్తమ విద్యార్థులు (ఉన్నత పాఠశాల లేదా విశ్వవిద్యాలయం)
అప్లికేషన్ కోసం విధానం ICA వెబ్సైట్- https://smartservices.ica.gov.ae
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







