రమదాన్ ఆఖరి పది రోజులూ పూర్తి కర్ఫ్యూ?
- April 03, 2021
కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో పాక్షిక కర్ఫ్యూ కాస్తా, పూర్తిస్థాయి కర్ఫ్యూ పరిస్థితులకు దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. రమదాన్ ఆఖరి పది రోజులు పూర్తిస్థాయి కర్ఫ్యూ అవసరమైతే విధించడానికి వీలుగా క్యాబినెట్ ముందు ఓ ప్రతిపాదనను హెల్త్ అథారిటీస్ వుంచినట్లు ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ అనూహ్యమైన స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగితే పూర్తి కర్ఫ్యూ విధించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని సదరు అధికారి పేర్కొన్నారు. పాక్షిక బ్యాన్ ఏప్రిల్ 22 వరకు కొనసాగుతుంది.. ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేసి, విశ్లేషించి, అవసరమైన మేర కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చని అథారిటీస్ భావిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా ఫేస్ మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఎక్కువగా గూమికూడకపోవడం చేస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







