నూతన ఆవిష్కరణల కోసం జీఎంఆర్ ఇన్నోవెక్స్ ప్రారంభించిన జీఎంఆర్ గ్రూపు
- April 03, 2021
హైదరాబాద్: ‘రేపటిని ఈరోజే సృష్టించడం’ అనే నిబద్ధతతో జీఎంఆర్ గ్రూప్ నేడు ఆవిష్కరణలను ప్రోత్సహించి, బలోపేతం చేసేందుకు జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరిట ఒక నూతన వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది.ఈ ఆవిష్కరణకు ప్రదీప్ సింగ్ ఖరోలా, విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి; సోమేష్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి;జయేష్ రంజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, పరిశ్రమలు మరియు వాణిజ్యం (ఐ అండ్ సి) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), జీబీఎస్ రాజు, బిజినెస్ చైర్మన్ – జీఎంఆర్ విమానాశ్రయాల విభాగం;ఎస్.జి.కె కిషోర్, ఈడీ-సౌత్ మరియు జీఎంఆర్ విమానాశ్రయాల చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్;రామా అయ్యర్, హెడ్ - జీఎంఆర్ ఇన్నోవేషన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

విమానాశ్రయాలలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా భారతదేశంలో విమాన ప్రయాణాన్ని జీఎంఆర్ పునర్నిర్వచించింది. భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సొల్యూషన్, సొంతంగా రూపొందించిన సెల్ఫ్ సర్వీస్ చెకిన్, ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్,ఫేస్ రికగ్నిషన్ ఆధారిత ప్యాసింజర్ ప్రాసెసింగ్ వంటి ఆవిష్కరణలు ఇక్కడ అంతర్గత నైపుణ్యంతో అభివృద్ధి చేయబడ్డాయి.
ఈ ఆవిష్కరణల ఆధారంగా, తమ వ్యాపారంలోని అన్ని పార్శ్వాలలో నూతన ఆవిష్కరణల కోసం ఒక వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో, GMR ఇన్నోవెక్స్ అందరికీ అందుబాటులో ఉండే ఒక నమూనాగా, స్టార్టప్‌లు, కార్పొరేట్లు, ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యంలో 'ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్'గా పనిచేస్తుంది. పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు వినూత్న ఆలోచనలు, పరిష్కారాలను కనుగొనడానికి, ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని పెంపొందించడానికి దోహదపడుతుంది. వివిధ స్టార్టప్‌లు, పరిశ్రమ భాగస్వాములు, జీఎంఆర్ ఉద్యోగులచే ఆవిష్కరణ కార్యకలాపాలకు వేదికగా పనిచేయడానికి హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంగణంలో ఈ నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో, GMR ఇన్నోవెక్స్ - ఎయిర్‌బస్; ప్లగ్ అండ్ ప్లే (ప్రముఖ గ్లోబల్ కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫాం); స్వీడిష్ ఇన్స్టిట్యూట్ (SI); టీ-హబ్ (హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఇన్నోవేషన్ మరియు బిజినెస్ ఇంక్యుబేటర్); ఐఐటి-హైదరాబాద్; ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ-అరిడ్ ట్రాపిక్స్ (ICRISAT), షులిచ్ బిజినెస్ స్కూల్ (కెనడాలోని టొరంటోలో ఉన్న బిజినెస్ స్కూల్ ఆఫ్ యార్క్ యూనివర్శిటీ)లాంటి పలు సంస్థలతో ఆవిష్కరణ ప్రాధాన్యతా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, “ఏవియేషన్, ఇన్నోవేషన్ అనేవి పర్యాయ పదాలు. నేడు అత్యాధునిక ఆవిష్కరణలు ఏవియేషన్‌లో జరుగుతున్నాయి.కోవిడ్ కాలంలో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది, కానీ అంతే బలంగా లేచి నిలబడింది.ఈ కాలంలో అనేక కొత్త సాంకేతికతలు రూపుదిద్దుకున్నాయి, అవన్నీ పరిశ్రమను దృడంగా మార్చాయి.భవిష్యత్తులో ప్రయాణికులు ఎలాంటి కాగితాలూ లేకుండా విమానాశ్రయం గుండా వెళ్లవచ్చు. ఈ-బోర్డింగ్ సేవను ప్రారంభించింది జీఎంఆర్ విమానాశ్రయాలే కాగా, నేడు 90 శాతం మంది ప్రయాణికులు దీనినే ఉపయోగిస్తున్నారు. ఏవియేషన్ పరిశ్రమలో వివిధ ప్రత్యేక విభాగాలలో ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడానికి జిఎంఆర్ ఇన్నోవెక్స్ ఒక అద్భుతమైన కేంద్రంగా మారుతుంది.’’ అన్నారు.
సోమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం, "ఈ రోజు ఇన్నోవేషన్ అనేది ఒక అవసరం అయింది. ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న ప్రపంచంలో, మనం నూతన ఆవిష్కారాలు కనిపెట్టకపోతే కనుమరుగై పోయే ప్రమాదముంది. కొత్త రాష్ట్రమైనా తెలంగాణకు నూతన ఆవిష్కరాల విషయంలో స్పష్టమైన విధానం.రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలను చురుకుగా ప్రోత్సహిస్తోంది.GMR ఇన్నోవెక్స్ మన రాష్ట్రంలో ఏర్పాటైనందుకు మేం సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఆ సంస్థ ఉనికి ఉన్న నేపథ్యంలో GMR ఇన్నోవేషన్ హబ్ వైవిధ్యభరితమైన ఫలితాలు చూపుతుందని ఆశిస్తున్నాము. ”
జీబీఎస్ రాజు, జీఎంఆర్ గ్రూప్ విమానాశ్రయాల బిజినెస్ చైర్మన్, “జీఎంఆర్ గ్రూప్ తన వ్యాపారాలలో నూతన ఆవిష్కరణలను ప్రారంభించడంలో, అవలంబించడంలో ముందుంటుంది. ఈ నూతన బిజినెస్ విభాగం ద్వారా నవతరపు, డిజిటల్ అంటే ఇష్టపడే వ్యవస్థాపక తరం సామర్థ్యాలను బట్టి, ఆవిష్కరణా సంస్కృతిని, వాతావరణాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా వాటిని విజయవంతం చేయడం మా లక్ష్యం. ఆవిష్కరణలకు సృజనాత్మకత చాలా అవసరం. మా భాగస్వాములు ప్రయోగాలు చేయడానికి జీఎంఆర్ గ్రూప్ యొక్క వైవిధ్యభరితమైన వ్యాపారాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. GMR ఇన్నోవెక్స్ ద్వారా, GMRను ఒక ఇన్నోవేషన్ థాట్ లీడర్‌గా మార్చాలని, ఈ అభివృద్ధి తదుపరి దశకు పునాది వేయాలని మేము కోరుకుంటున్నాము.” అన్నారు.
ఎస్.జి.కె కిషోర్, ఈడీ-సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్- జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, “GMR ఇన్నోవెక్స్ అనేది GMRతో పాటు మా భాగస్వాములు,వాటాదారులకు వర్తమానాన్ని దాటి భవిష్యత్తును చూసేందుకు;రేపటి సవాళ్లు, అవకాశాల కోసం సిద్ధంగా ఉండటానికి సహాయపడే ఒక వేదిక. ఈ రోజు పలు సంస్థలతో ప్రకటించిన పలు భాగస్వామ్యాలు ఇక్కడి నుంచి రాబోయే ఆవిష్కరణలకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి.” అన్నారు.
మెరుగైన సామర్థ్యం, మెరుగైన కస్టమర్ అనుభవం, భాగస్వాములందరికీ ఎక్కువ విలువను అందించడానికి GMR ఇన్నోవెక్స్ డిజిటల్, నాన్-డిజిటల్ డొమైన్లు రెండింటి ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది. అదే సయమంలో సృజనాత్మక ఆలోచనలను రూపొందించి,పెంపొందించి, ప్రోత్సహించడానికి మరియు అన్ని విజయవంతమైన ఆవిష్కరణలను మార్కెట్ చేయడం కోసం వ్యూహాన్ని రూపొందించడానికి కృషి చేస్తుంది. తమ భాగస్వాముల వినూత్న ఆలోచనలను మధించి, ఒక ఫోరమ్ ద్వారా వాటికి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. జీఎంఆర్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న విమానాశ్రయాలు, ఎయిర్ కార్గో, MRO, లాజిస్టిక్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, భాగస్వాములు విస్తృతమైన రంగాలలో తమ ఉత్పత్తులను/సేవలపై ప్రయోగాలు చేయవచ్చు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







