ఏపీలో కరోనా కేసుల వివరాలు

ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. క్రమంగా పెరుగుతూ పోతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ రెండు వేల మార్క్‌ను దాటేసింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,812 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,331 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఇక, కోవిడ్ బారినపడి మరో 11 మంది మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. ఇక, గడచిన 24 గంటల్లో 853 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,13,274కు చేరగా.. రికవరీ కేసులు 8,92,736కి పెరిగాయి.. ప్రస్తుతం యాక్టిక్ కేసులు 13,276గా ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 7,262 మంది మృతిచెందారు. 

Back to Top