తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ !
- April 07, 2021
హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల పేర్కొన్నారు.మహారాష్ట్ర నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్నాయని, అందువల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎక్కువ మంది అసిమ్టమాటిక్ గా ఉంటున్నారని, తెలంగాణలో వాక్సినేషన్ వేగవంతం చేసేందుకు.. ప్రతి రోజు లక్ష మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ నాన్ కోవిడ్ సేవలు అందుతాయని, ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపార కోణంలో కరోనా చికిత్స ను చూడొద్దని కోరారు. మాస్కులు తప్పకుండా ధరించాలని కోరిన ఆయన ఇంకా కొన్ని రోజులు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుంది అని, అయితే లాక్ డౌన్ , కర్ఫ్యూ లు ఉండవని అన్నారు. పబ్ , క్లబ్బుల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలని ఈటల పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







