51 వేల ఉద్యోగాలే లక్ష్యంగా మాల్స్ లో సౌదీయేషన్ నిబంధనల అమలు
- April 08, 2021
సౌదీ:సౌదీలోని మాల్స్, రెస్టారెంట్ ఔట్ లెట్స్, మార్కెట్ ఔట్ లెట్స్ లో స్థానికులకు 51 వేల ఉద్యోగాలను కల్పించటమే లక్ష్యంగా సౌదీయేషన్ నిబంధనలు అమలు చేసేలా కింగ్డమ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం మూడు మంత్రివర్గ తీర్మానాల అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లు మానవ వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో తొలి తీర్మానం మాల్స్ కు సంబంధించినది కాగా...రెండు, మూడో తీర్మానాలు రెస్టారెంట్, కేఫ్ ఔట్ లెట్స్, మార్కెట్ ఔట్ లెట్స్ గురించి ఉన్నాయి. అంటే ఇక నుంచి ఈ మూడు రంగాల్లో సౌదీయేషన్ నిబంధనల మేరకు కార్మికుల నిష్పత్తిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మాల్స్ లో సౌదీయేషన్ శాతం మేరకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయంతో ఆయా రంగాల్లో సౌదీలకు 51వేల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుండగా... ప్రవాసీయులకు మాత్రం ఉపాధి అవకాశాలు కుదించుకుపోయే ప్రమాదం నెలకొంది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







