కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
- April 08, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రభుత్వం వేగవంతం చేసింది.ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ కరోనా రెండో డోస్ తీసుకున్నారు.ఢిల్లీల ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ రెండో డోసు వేయించుకున్నారు. ప్రధాని మోడీకి పంజాబ్‌కు చెందిన నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సిన్ కూడా ఒకటని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారంతా టీకా వేసుకోవాలని.. అందుకోసం కోవిడ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేశారు ప్రధాని మోదీ. కాగా...ప్రధాని మోదీ మొదటి డోస్‌ను గత నెల 1న వేయించుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజే ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







