దుబాయ్ వెళ్తున్న విమానానికి తప్పిన ప్రమాదం
- April 09, 2021
కోజికోడ్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కార్గో కంపార్ట్మెంట్లో ఫైర్ హెచ్చరిక రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమాన ఫైలట్ విమానాన్ని కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు.విమానంలో 17మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులకు, సిబ్బందికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







