అనుమతి లేకుండా ఉమ్రా చేస్తే 10,000 దిర్హాముల జరీమానా
- April 09, 2021
యూఏఈ: రమదాన్ సందర్భంగా అనుమతి లేకుండా ఉమ్రా ప్రార్థనలు నిర్వహిస్తే 10,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ వెల్లడించాయి. అనుమతి లేకుండా మక్కాలోని గ్రాండ్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, వారికి అదనంగా 1,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రాండ్ మసీదు సామర్థ్యానికి అనుగుణంగా, కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు రమదాన్ సందర్భంగా. సెక్యూరిటీ కంట్రోల్ కేంద్రాలు, రోడ్లు.. గ్రాండ్ మసీదు వైపుగా వెళ్ళే అన్ని ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ సిబ్బంది పెట్రోల్ నిర్వహించడం జరుగుతుంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్రా మరియు తవకల్నా యాప్స్ అప్-డేట్ చేయడం జరిగిందని పేర్కొన్నాయి. సౌదీ అథారిటీ ఫర్ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారీ వీటిని మెరుగ్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







