జార్జియాలో విజయ్ 65వ చిత్రం షూటింగ్ ప్రారంభం
- April 09, 2021జార్జియా: తమిళ స్టార్ హీరో, తలపతి విజయ్ 65వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.పూజా హెగ్డేకు కోలీవుడ్ లో ఇదే మొదటి చిత్రం.విజయ్ తమ 65 చిత్రం షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. ఇప్పటికే విజయ్ జార్జియా ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... తాజాగా జార్జియాలో షూటింగ్ స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు విజయ్ కు సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు 'తలపతి65' టీం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై 'తలపతి65' చిత్రం భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. కాగా విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం ఈ ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన 'మాస్టర్' తమిళంలో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?