సీఎం వైఎస్ జగన్ తిరుపతి ప్రచారం పర్యటన రద్దు
- April 10, 2021
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. నిజానికి ఈ నెల 14వ తేదీన ఆయన తిరుపతి ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరిగింది.. ఈ మేరకు వైసీపీ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే అనూహ్యంగా ఆయన సభ రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు ఆయన లేఖ రాశారు. ఈనెల 14వ తేదీన తిరుపతి బహిరంగ సభకు నేను వస్తానని ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్న సంగతి మీకు తెలిసిందే అని ఆయన పేర్కొన్నారు.. ఆ సభకు రావడం ద్వారా మీ ఆత్మీయ అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించానని అయితే తాజా కరోనా హెల్త్ బులిటెన్ చూసిన తర్వాత ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.
దేశంతో పాటు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని నిన్న బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 31892 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 2765 మంది కరోనా పాజిటివ్ తేలిందని పేర్కొన్నారు. అందులో చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదయ్యాయని అలాగే నెల్లూరు జిల్లాలో కూడా 292 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ కోసం వ్యక్తిగతంగా బహిరంగ సభకు హాజరు అయితే నా మీద అభిమానంతో ఆప్యాయతతో వేలాది మంది తరలి వస్తారని అయితే మీరందరూ నాకు ముఖ్యమేనని మీ ఆరోగ్యం ఆనందం నాకు ముఖ్యం అని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత గల స్థానంలో ఉన్న అన్నగా, తమ్ముడిగా తిరుపతిలో బహిరంగ సభ రద్దు చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు.
నేను వ్యక్తిగతంగా వచ్చి ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా మన అందరి ప్రభుత్వం మీ పిల్లల కోసం మన అవ్వా తాతల కోసం అక్కాచెల్లెళ్ల కోసం మన గ్రామాలు పట్టణాలు కోసం ఏం చేసింది అన్నది మీ అందరికీ వివరిస్తూ మీకు కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశాను అని ఆయన పేర్కొన్నారు. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి నిండు మనసుతో గుండె నిండా ప్రేమతో ఓటు రూపంలో ఇస్తారని మనందరి అభ్యర్థి నా సోదరుడు గురుమూర్తి ని గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్న కు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువగా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి అందిస్తారని ఆశిస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









