కొన్ని ప్రైవేటు స్కూళ్ళకు నాన్ ఎగ్జామ్ అస్సెస్మెంట్స్

- April 14, 2021 , by Maagulf
కొన్ని ప్రైవేటు స్కూళ్ళకు నాన్ ఎగ్జామ్ అస్సెస్మెంట్స్

యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రత్యామ్నాయ అస్సెస్మెంట్ విధానాన్ని కొన్ని ప్రైవేటు స్కూళ్ళ కోసం అనుమతించింది. ఇంటర్నేషనల్ బక్కాలౌరేట్ (ఐబి) కరికులమ్ గల స్కూళ్ళకు 2021-2021 కోసం ఈ విధానానికి అనుమతివ్వడం జరిగింది. 2020 నవంబర్ లో కోవిడ్ 19 భద్రతా చర్యల్లో భాగంగా ఐబీ - నాన్ ఎగ్జామ్ అస్సెస్మెంట్ విధానాన్ని వినియోగించారు. టీచర్ అంచనా వేసి ఇచ్చే గ్రేడ్లు, ఇంటర్నల్ అస్సెస్మెంట్స్ ద్వారా దీన్ని నిర్ణయిస్తారు. బ్రటిష్ మరియు ఐబీ కరికులమ్ ఉపయోగించే స్కూళ్ళకు ఈ అస్సెస్మెంట్ మెథడ్స్ వర్తిస్తాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com