వ‌ర‌ల్డ్ ఎక్స్ పో నిర్వ‌హించేందుకు మేం సిద్ధం: షేక్ మహమ్మద్

- April 15, 2021 , by Maagulf
వ‌ర‌ల్డ్ ఎక్స్ పో నిర్వ‌హించేందుకు మేం సిద్ధం: షేక్ మహమ్మద్

దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020ని నిర్వ‌హించటానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని యూఏఈ ప్ర‌ధాని, దుబాయ్ రూల‌ర్ షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌ఖ్తౌమ్ అన్నారు. ఎక్స్ పో నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నిర్వ‌హించిన స‌మావేశానికి ఆయ‌న అధ్య‌క్ష‌త వ‌హించారు. సంద‌ర్భంగా మాట్లాడుతూ దుబాయ్ ఎక్స్ పో 2020ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌టం తమ‌కు ప్ర‌తిష్టాత్మక అంశమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 2,30,000 మంది కార్మికులు ఎక్స్ పో నిర్వ‌హ‌ణ కోసం శ్ర‌మించార‌ని, ఇందులో 190 దేశాలు భాగ‌స్వామ్యం అవుతున్నాయ‌ని వివ‌రించారు. కోవిడ్ స‌వాళ్ల‌ను ఈ ఎక్స్ పోను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌టం..ఒక్క యూఏఈ విజ‌యం మాత్ర‌మే కాద‌ని ప్ర‌పంచ విజ‌యంగా భావించాల‌న్నారు.గ్లోబ‌ల్ ఎకాన‌మీ పురోగ‌తికి, ఈవెంట్ల నిర్వ‌హ‌ణ‌కు ఈ ఎక్స్ పో ఓ మార్గ‌నిర్దేశ‌కంగా మారుతుంద‌ని కూడా ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. ‌‌

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com