రమదాన్ శుభాకాంక్షలు తెలిపన కింగ్ సల్మాన్
- April 15, 2021
సౌదీ: సౌదీ రాజు కింగ్ సల్మాన్ ముస్లిం సోదరులకు రమదాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడి కృపతో అంతా బాగుండాలని...ముస్లిం సోదరుల పట్ల అశీర్వాదం చూపుతున్న అల్లాకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ ద్వారా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కింగ్ సల్మాన్...రమదాన్ వేళ భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లును సజావుగా నిర్వహించాలని..కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో కింగ్డమ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ తీవ్రతపై సమావేశంలో చర్చించారు. కింగ్డమ్ వ్యాప్తంగా ఇప్పటికే 6 మిలియన్ల మందికిపైగా వ్యాక్సిన్ అందించనట్లు వివరించారు.ఇక విజన్ 2030 అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు..దేశాన్ని ఆర్ధికంగా పుంజుకునేందుకు దోహదపడుతున్నాయన్నారు. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలు శరవేగంగా అమలులోకి వస్తున్నాయని, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల తీరును ఇందుకు నిదర్శనంగా ఆయన వివరించారు. మరో పదేళ్లలో సౌదీ పవర్ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







