హోయి యాప్‌తో హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలలో ప్రయాణం అత్యంత సౌకర్యవంతం
- April 15, 2021
- ఇంటి నుంచి గమ్యస్థానం వరకు ప్రయాణీకులకు సుఖవంతమైన ప్రయాణం
- డిజిటల్, కాంటాక్ట్ లెస్ ప్రయాణాల నేపథ్యంలో హోయి యాప్ తో ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభవం
_1618491880.jpg)
- జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి, వారి ప్రయాణం సజావుగా సాగడానికి డిజిటల్ వేదికను ఉపయోగించుకుంటున్నాయి.
- భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా డిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు గత ఏడాది హోయి (HOI) యాప్ భాగస్వామ్యంతో విమానాశ్రయాలలో కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్ సేవలను ప్రారంభించాయి.
- హోయి డిజిటల్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ - ఆండ్రాయిడ్, IOS కోసం మొబైల్ యాప్ రూపంలో, వెబ్ యాప్ రూపంలో మరియు విమానాశ్రయాలలో డిజిటల్ సెల్ఫ్ ఆర్డర్ కియోస్క్‌గా లభిస్తుంది. ఇది స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ ఇంటిగ్రేషన్, కామర్స్ ఫీచర్స్ కలిగిన డిజిటల్ ప్లాట్‌ఫామ్.
- హోయి యాప్ ద్వారా డ్యూటీ-ఫ్రీ, రిటైల్, ఫుడ్ అండ్ బెవరేజెస్, లాంజ్‌లు, పార్కింగ్, క్యాబ్ వంటి పలు సేవల 80 ప్రముఖ అవుట్‌లెట్‌లు మరియు బ్రాండ్‌లకు చెందిన 10,000కు పైగా ఉత్పత్తులు ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకురాబడ్డాయి.
_1618491891.jpg)
- ప్రయాణీకులు తమ ప్రయాణ వివరాలను హోయి యాప్‌తో జోడిస్తే లేదా ప్రయాణ వివరాలను స్కాన్ చేయడం ద్వారా దానిలో అప్ లోడ్ చేస్తే, ప్రయాణంలోని ప్రతి దశలో ప్రయాణీకులకు సహాయపడే విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఆ తరువాత ప్రయాణీకులు వారు ప్రయాణంచబోయే విమాన వివరాలను ట్రాక్ చేయవచ్చు. అంతే కాకుండా గేట్లలో మార్పులు, గమ్యం వద్ద వాతావరణ సూచనల గురించి రియల్ టైమ్ అలర్ట్ లను పొందవచ్చు. విమానాశ్రయానికి/విమానాశ్రయం నుంచి బయటికి ప్రయాణ సదుపాయాలను అన్వేషించి, బుక్ చేసుకోవచ్చు.
- ఈ యాప్ ద్వారా ప్రయాణం రోజున ట్రాఫిక్, చెకిన్‌కు పట్టే సమయం, సెక్యూరిటీకి పట్టే సమయం (అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్) మరియు బోర్డింగ్ గేట్‌కు ఎంత దూరం ఉంది వంటి వివిధ అంశాలపై సమాచారం ఆధారంగా ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
- వివిధ టచ్ పాయింట్ల వద్ద వాస్తవంగా ఎంత రద్దీ ఉన్నారన్న సమాచారంతో 'ప్రిడిక్టివ్ టైమ్ టు గేట్' ఫీచర్‌ను అందించడం ద్వారా ఈ యాప్ నగరంలో ఎక్కడి నుంచైనా విమానాశ్రయం, అక్కడి నుంచి బోర్డింగ్‌కు వెళ్లేందుకు పట్టే సమయాన్ని తెలుసుకోవచ్చు.
_1618491900.jpg)
- ఒకసారి విమానాశ్రయానికి వచ్చాక, వాయిస్ గైడెన్స్‌తో కూడిన ఇండోర్ నావిగేషన్ బోర్డింగ్ గేట్‌కు వెళ్ళే మార్గాన్ని కనుగొనడంలో ప్రయాణికులకు సహాయపడుతుంది. ప్రయాణీకులు షాపింగ్ చేయడానికి, భోజనం చేయడానికి లేదా వాష్‌రూమ్‌లు, బేబీ కేర్ రూమ్ వంటి సౌకర్యాల కోసం HOI డిజిటల్ టెర్మినల్ మ్యాప్‌లను ఉపయోగించి, వాటిని కనుగొనొచ్చు.
- బ్యాగ్ ట్యాగ్ సమాచారాన్ని స్కాన్ చేయడం ద్వారా, ప్రయాణీకుల లగేజ్ విమానంలోకి ఎక్కించబడిందని HOI తెలియజేస్తుంది. అలాగే, విమానానికి సంబంధించి గేట్లలో మార్పు ఉంటే, ఆ సమాచారం ప్రయాణీకులకు వెంటనే HOI యాప్ ద్వారా తెలిసిపోతుంది.
- ఈ యాప్‌లోని జియో ఫెన్సింగ్ ఫీచర్ ద్వారా హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రవేశించిన వెంటనే ప్రయాణికులు ఆటో చెకిన్ అయిపోతారు. దీని వల్ల నేరుగా భద్రతా స్క్రీనింగ్ కోసం వెళ్లగలిగి సమయం ఆదా అవుతుంది.
- విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులు ఈ యాప్ ద్వారా అధీకృత క్యాబ్ సర్వీసు ప్రొవైడర్ల నుండి క్యాబ్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
- కాంటాక్ట్‌లెస్ ఫుడ్ ఆర్డరింగ్, చెల్లింపులు, గేట్ డెలివరీ HOI యాప్ ప్రత్యేక లక్షణాలు. HOI యాప్ ప్రయాణీకులను విమానాశ్రయాలలో నిరీక్షణ సందర్భంగా సురక్షితంగా ఆర్డర్లకు, భోజనాన్ని తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
- కాంటాక్ట్‌లెస్ ఆర్డర్, డెలివరీని పొందడానికి, ప్రయాణీకులు అవుట్‌లెట్‌లు లేదా బోర్డింగ్ గేట్ల దగ్గర ఉంచిన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవచ్చు లేదా HOI యొక్క వెబ్ వెర్షన్‌ను ఉపయోగించి నేరుగా F&B కాటలాగ్‌లో పరిశీలించవచ్చు. యూజర్ చేయాల్సిందల్లా జాబితాలో ఉన్న వస్తువులను బ్రౌజ్ చేయడం, కావాల్సిన ఆహారాన్ని కార్ట్‌కు యాడ్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించడం. అంతే, వారి ఆర్డర్ గేట్ల వద్ద డెలివర్ చేయడం జరుగుతుంది.
- హోయి యాప్ లోని ‘స్కాన్ అండ్ షాప్’ ఫీచర్ 100% కాంటాక్ట్‌లెస్ షాపింగ్ పరిష్కారాన్ని అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు షెల్ఫ్ నుండి ఉత్పత్తులను ఎంచుకొని, దాని బార్ కోడ్‌ను స్కాన్ చేసి, డిజిటల్ చెల్లింపు చేయొచ్చు.
- రెండు విమానాశ్రయాలలో అనేక షాపింగ్ అవుట్‌లెట్‌లు, డ్యూటీ-ఫ్రీ స్టోర్స్ ఉండగా, ఈ యాప్ వస్తువులపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాటిని కొనుగోలు చేసేందుకు, డిజిటల్ చెల్లింపులకు అనుమతిస్తుంది.
- ప్రయాణీకులు వారి గమ్యస్థాన విమానాశ్రయంలోకి దిగాక, వారి బ్యాగేజ్ బెల్ట్ సమాచారం మరియు క్యాబ్ ఎంపికల గురించి హోయి వారికి తెలియజేస్తుంది.
- హోయి యాప్‌లో ఇటీవల మొబైల్ కామర్స్, విమానాల ట్రాకింగ్, విమానాశ్రయ సేవలు, బుక్ ట్రావెల్ ఫీచర్స్ వేగంగా పెరిగినట్లు గుర్తించారు.
- ఇలాంటి ప్రయోజనాలతో ఈ యాప్ గత రెండు త్రైమాసికాలలో డిజిటల్ ఆర్డర్‌ల పరంగా వారానికి 20% వృద్ధిని సాధించింది. GMR విమానాశ్రయాలలోని ప్రయాణీకులలో పెరుగుతున్న డిజిటల్ ధోరణిని ఇది తెలియజేస్తుంది.
- విమానాశ్రయ ఇంటర్నెట్, విమానాశ్రయాలలో ప్రీ-బుక్ పార్కింగ్ స్పేస్‌లతో పాటు బోర్డింగ్ పాస్‌ను సేవ్ చేసి, అవసరమైన చోట ఫోన్‌లో ప్రదర్శించేందుకు ఈ యాప్ వన్ టచ్ వైఫైని అందిస్తుంది.
- హోయి యాప్ వివిధ సేవలను ఉపయోగించడానికి ప్రయాణీకులు ప్లేస్టోర్/IOS స్టోర్ నుండి HOI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు లేదా shop.hoi.in ను సందర్శించండి.
"ఈ క్లిష్ట సమయంలో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించడం మాకు చాలా ముఖ్యం. సామాజిక దూర నిబంధనలు ఇప్పుడు సాధారణంగా మారిన నేపథ్యంలో మా విమానాశ్రయాలలో ప్రయాణీకుల భద్రతను పెంచడానికి మేము అనేక కార్యక్రమాలను ప్రారంభించాం. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కాంటాక్ట్‌లెస్, డిజిటల్ అనుభవాన్ని విస్తరించడానికి హోయి యాప్ ఒక ప్రత్యేకమైన వేదిక.
మా విమానాశ్రయ కార్యకలాపాలు చాలావరకు డిజిటల్‌గా మారుతున్న నేపథ్యంలో హోయి యాప్ ప్రయాణీకులు తమ ఇంటి నుంచి గమ్యస్థానం వరకు ఎలాంటి ఇబ్బందులూ లేని ప్రయాణాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ఫ్లైట్ ట్రాకింగ్, డిజిటల్ ఆర్డరింగ్, గేట్ డెలివరీ లాంటి వాటి కోసం ఇది చాలా ఉపయోగకరం. ఒక్కమాటలో చెప్పాలంటే, HOI ప్రయాణంలోని ప్రతి దశలో ప్రయాణీకునికి ఒక నిజమైన సహచరుని లాంటిది.” అని GMR విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









