సోమవారం వరకు వాతావరణ హెచ్చరికలు విడుదల చేసిన సౌదీ అరేబియా

- April 16, 2021 , by Maagulf
సోమవారం వరకు వాతావరణ హెచ్చరికలు విడుదల చేసిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, సౌదీ అరేబియాకి సంబంధించి పలు ప్రాంతాలకు రానున్న ఐదు రోజులకు సంబంధించి వాతావరణ హెచ్చరికలు విడుదల చేసింది. అసిర్, బహా,జజాన్, నజ్రాన్ మరియు మక్కా రీజియన్లలో గురువారం నుంచి సోమవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంటుంది. రియాద్, హెయిల్, మదీనా ప్రాంతాల్లోనూ ఇదే తరహా వతావరణ పరిస్థితులు శుక్రవారం మరియు శనివారం వుంటాయి.  తూర్పు మరియు ఉత్తర సరిహద్దు, అల్ జవాఫ్ మరియు తుబుక్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. పౌరులు అలాగే రెసిడెంట్స్ అప్రమత్తంగా వుండాలనీ, కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం వుంటుంది గనుక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com