పొగాకు వాడకంపై నిషేధమెక్కడ?
- June 01, 2015
ప్రపంచానికి పెను శాపంగా మారిన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్‌కి ప్రధాన కారణం స్మోకింగ్. ఎన్నో ఏళ్ళుగా పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడంలేదు. ఖతార్‌లో పొగాకు అమ్మకం, వాడకంపై ఆంక్షలు ఉన్నా అవి, క్షేత్ర స్థాయిలో అమలవడంలేదు. హమాద్ మెడికల్ కార్పొరేషన్, యాంటీ స్మోకింగ్ క్లీనిక్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ ముల్లా మాట్లాడుతూ పబ్లిక్ ప్లేసెస్‌లో స్మోకింగ్‌పై బ్యాన్ ఉన్నా, ఇంప్లిమెంటేషన్ సరిగా జరగకపోవడం శోచనీయమని అన్నారు. వరల్డ్ టుబాకో డే రోజున అయినా పొగాకు ఉత్పత్తుల అమ్మకాల్ని బ్యాన్ చేస్తే బాగుంటుందనీ, కానీ అలా కూడా జరగడంలేదని ఆయన అన్నారు. ఖతార్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసినవారికి 500 ఖతార్ రియాల్స్ జరీమానా అమల్లో ఉంది. అయితే అది ఆచరణలో విఫలమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ధూమపానం చేసేవారి పట్ల ఉన్న నిబంధనల్ని కఠినతరంగా అమలు చేయాల్సి ఉందని మొహ్మద్ అల్ ముల్లా చెప్పారు.
-- వనంబత్తిన రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







