రెసిపిరేటర్స్ కొరత ప్రచారాలను కొట్టిపారేసిన ఒమన్
- April 18, 2021
ఒమన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు అందించే రెసిపిరేటర్స్ కు కొరత ఏర్పడిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. పేషెంట్లకు కావాల్సిన స్థాయిలో రెసిపిరేటర్స్ ఉన్నాయని స్పష్టత ఇచ్చింది. సలాలలోని కబూస్ ఆస్పత్రిలో రెసిపిరేటర్స్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పేషెంట్లకు తగిన చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆస్పత్రుల్లో అందుకు కావాల్సిన వసతులను పెంచామని కూడా వివరించింది. ప్రజలు ఎవరూ ఊహాగానాలను విశ్వసించొద్దని, సంబంధిత శాఖ నుంచి కావాల్సిన సమాచారాన్ని పొందాలని సూచించింది. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







