Dh400,000విలువైన డ‌బ్బు, న‌గ‌ల చోరీ కేసులో గ్యాంగ్ అరెస్ట్

- April 18, 2021 , by Maagulf
Dh400,000విలువైన డ‌బ్బు, న‌గ‌ల చోరీ కేసులో గ్యాంగ్ అరెస్ట్

యూఏఈ: ఓ ఇంట్లో Dh400,000 విలువైన డ‌బ్బు, న‌గ‌లు దోచుకున్న కేసులో తొమ్మిది మంది దొంగ‌ల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు షార్జా పోలీసులు వెల్ల‌డించారు.ఓ మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు విచార‌ణ ప్రారంభించిన పోలీసులు ముందుగా ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని ఇంట‌రాగేష‌న్ చేశామ‌ని..దీంతో అత‌ని నేర చ‌రిత్ర మొత్తం బ‌య‌ట‌ప‌డింద‌ని వివ‌రించారు. ఫిర్యాదు చేసిన మ‌హిళ ఇంటితో పాటు గతంలో అత‌ను ప‌లు ఇళ్ల‌లో చ‌రీలకు పాల్ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు.చోరీల‌లో త‌న‌కు మ‌రో ఎనిమిది మంది స‌హ‌క‌రించార‌ని,వారిలో మ‌హిళ‌లు కూడా ఉన్న‌ట్లు విచార‌ణ‌లో నిందుతుడు ఒప్పుకున్న‌ట్లు తెలిపారు.నిందితుడు ఇచ్చిన స‌మాచారంతో మిగిలిన ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేశామ‌న్నారు పోలీసులు.నిందితులు అంద‌ర్నీ ప‌బ్లిక్ ప్రాసిక్యూష‌న్ త‌ర‌లించామ‌న్నారు.ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల ద‌గ్గ‌ర సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాల‌ని త‌ద్వారా చోరీల‌ను అడ్డుకోగ‌ల‌మ‌ని పోలీసులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com