చెన్నై విమానాశ్రయంలో ఆరు కిలోల బంగారం పట్టివేత..

- April 18, 2021 , by Maagulf
చెన్నై విమానాశ్రయంలో ఆరు కిలోల బంగారం పట్టివేత..

చెన్నై: భారత్ లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో భారీగా బంగారం పట్టుబడుతోంది.దుబాయ్ తదితర దేశాల నుంచి అక్రమంగా.. అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలిస్తూ ఇటీవల కాలంలో చాలామంది పట్టు బడుతున్నారు.ఎవరికీ.. తెలియకుండా గుట్టురట్టుగా అక్రమంగా పలు మార్గాల్లో బంగారం తరలిస్తున్న వ్యక్తులకు కస్టమ్స్ అధికారులు షాకిస్తున్నారు.తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం భారీగా పట్టుబడింది.దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. మూడు కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో దాచి ఉంచిన ఆరు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు శనివారం వెల్లడించారు.

విమానంలో పెద్ద ఎత్తున బంగారం తీసుకువస్తున్నారన్న సమాచారం మేరకు చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ మేరకు దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో తనిఖీలు చేపట్టగా.. ఆరు కిలోల బంగారం పట్టుబడింది. అనంతరం బంగారంను స్వాధీనం చేసుకోని ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. తెల్లటి టేపును చుట్టి ఆరు బంగారం కడ్డీలను తరలిస్తున్నారు. కాగా పట్టుబడిన ఈ బంగారం విలువ రూ.2.94 కోట్లు ఉంటుందని చెన్నై కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com