గల్ఫ్ మృతుడికి బంధువుల ఊరిలో అంత్యక్రియలు
- April 18, 2021
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ కు చెందిన నలిమెల జెశ్వంత్ రెడ్డి (29) ఇటీవల బహరేన్ లో గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవపేటిక ఆదివారం ఎయిర్ ఇండియా విమానంలో బహరేన్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నది. ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ విమానాశ్రయం నుండి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.మృతుడు జెశ్వంత్ రెడ్డి కుటుంబం నిజామాబాద్ లో కిరాయి ఇంట్లో ఉంటున్నందున అతని మేనత్త నివసించే ఆర్మూర్ మండలం మంథని గ్రామం లో అంత్యక్రియలు నిర్వహించాలని బంధువర్గం నిర్ణయించింది.
మృతుని తండ్రి చాలా ఏళ్ల క్రితం ప్రమాదంలో గాయపడి అచేతనంగా ఉండటం వలన స్వగ్రామం ఆలూరు లోని ఆస్తులు అమ్ముకొని నిజామాబాద్ లో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలే బహరేన్ కు వెళ్లిన జెశ్వంత్ రెడ్డి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో అతనిపై ఆధారపడ్డ తండ్రి రాంరెడ్డి, తల్లి దివ్య, చెల్లెలు నిఖిల దిక్కులేని వారయ్యారు.

కరోనా ఆంక్షలు, రంజాన్ సందర్బంగా కుదించిన పనివేళలు ఉన్నప్పటికీ శ్రమకోర్చి మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి బహరేన్ లోని తెలంగాణ సామాజిక సేవకులు తిర్మన్ పల్లి శేఖర్, ఎపి ఎన్నార్టి కోఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వర్ రావు, తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ ఎల్లపు, మురళి నోముల బృందం సహకరించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







