తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం..!

- April 19, 2021 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం..!

హైదరాబాద్: కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీ తగ్గించడంపై దృష్టి పెట్టాలని చెప్తూనే.. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో వివరాలపై అసహనం వ్యక్తం చేసింది. తమకు కనీస వివరాలు కూడా ఇవ్వకపోతే ఎలాగంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని ఘాటుగానే వ్యాఖ్యానించింది.దీంతో, జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు.ఈ సమాధానంతో సంతృప్తి చెందని కోర్టు ప్రజల ప్రాణాలు గాల్లో ఉంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా? అని హెచ్చరించింది. విరామం తర్వాత మధ్యాహ్నం దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com