ఏపీలో రాత్రి కర్వ్ఫూ పై క్లారిటీ
- April 19, 2021
అమరావతి: అమరావతిలో కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరిగింది. నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ముందు నుండి ప్రచారం జరిగింది. పదవ తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.రాత్రి కర్వ్ఫూ ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నా అదేమీ లేదని ఆళ్ళ నాని కొట్టి పారేసారు.ఇక ఇంటర్ పరీక్షలు వాయిదా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.స్కూళ్లకు శెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉందని, దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షల అవకాశం ఉందని అంటున్నారు.ఇక బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఉందని అంటున్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టి వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.ఒక అరగంట గ్యాప్ తర్వాత మీటింగ్ మళ్ళీ మొదలయింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







