స్మోకింగ్ చేస్తూ పోలీసుపై దాడి, వ్యక్తి అరెస్ట్
- April 21, 2021కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో, అదీ ఉపవాస సమయంలో బహిరంగంగా స్మోకింగ్ చేస్తూ ఓ కువైటీ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు, పోలీసు అధికారులపై దాడికి యత్నించినట్లు కూడా అభియోగాలు మోపబడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో, అది కూడా ఉపవాస సమయంలో స్మోకింగ్ చేయవద్దని సూచిస్తే, నిందితుడు పోలీసు అధికారిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు అధికారులు. రమదాన్ మాసంలో ఉపవాస సమయంలో బహిరంగంగా తినడం, స్మోకింగ్ చేయడం వంటివాటిపై నిషేధం వుంది. 100 కువైటీ దినార్ల వరకు జరీమానా, నెల రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు