'సర్కారు వారి పాట' టీజర్ విడుదల తేదీ ఖరారు
- April 23, 2021
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ 'సర్కారు వారి పాట'. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ ను ఎలాంటి అడ్డంకి లేకుండా పూర్తి చేసుకుంది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్ లో మొదలైన రెండవ షెడ్యూల్ షూటింగ్ ను మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున రద్దు చేశారు మేకర్స్. మహేష్ హెయిర్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మరోవైపు 'సర్కారు వారి పాట' టీం సూపర్ స్టార్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఫస్ట్ లుక్, టీజర్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో హీరోల పుట్టినరోజున సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ను ఇచ్చే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ... 'సర్కారు వారి పాట' టీం మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న, మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న టీజర్ ను విడుదల చేయబోతున్నారట.ఈ వార్త ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తోంది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







