ఆ బ్యాగు ధర 30 లక్షలట!!
- April 27, 2021
మారుతున్న కాలానికి తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచం కూడా మారుతూ వినూత్న ఐడియాలతో మనసుల్ని దోచేస్తూ ఉంటుంది.ఫ్యాషన్ రంగంలో ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ 'లూయిస్ విట్టన్' కు ఉన్న బ్రాండ్ విలువ గురించి ప్రతిరేకంగా చెప్పనక్కర్లేదు..లూయిస్ విట్టన్ బాగ్ ఉందంటే ఆస్తుల విలువ పెరిగినట్టే అంటే అతిశయోక్తి కాదేమో..అయితే, ఇటీవల ఈ బ్రాండ్ వారు తయారుచేసిన విమానం ఆకారంలో ఉన్న హ్యాండ్ బాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది..

వింటర్ 2021 సేకరణలో భాగంగా ఏవియేషన్ ప్రేరణతో తయారుచేసిన పురుషుల బ్యాగ్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. బ్రౌన్ రంగులో విమానం ఆకారాన్ని పోలిన ఈ బ్యాగుపై లూయిస్ విట్టన్ యొక్క సంతకం మోనోగ్రామ్ నమూనా తోపాటు విమానం లాగా రెక్కలు, ఇంజన్లు, తోక, ముక్కును కలిగి ఉంది. అయితే ఈ బాగ్ ఆకారానికి కాకుండా బాగ్ ధరకు జనం అవాక్కయ్యారు. వర్జిల్ అబ్లో చే రూపొందించబడిన ఈ బాగ్ ధర $ 39,000 (అంటే షుమారు లక్ష రూపాయలన్నమాట.!
ఈ బాగ్ ధర సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ బాగ్ ధరకు ఏకంగా విమానమే కొనచ్చు అంటూ సెటైర్లు విసురుతున్నారు.
తాజా వార్తలు
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్‌ను జయించి..మారథాన్ రన్నర్‌గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు









