నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- April 10, 2026
హైదరాబాద్: ఏప్రిల్10 దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. నేటి (శుక్రవారం) నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తూ కొత్త విధానాన్ని అమలు చేశారు. ఇకపై వాహనదారులు తప్పనిసరిగా FASTag లేదా UPI ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
టోల్ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగదు చెల్లింపులు నిలిపివేయడంతో టోల్‌ప్లాజాల వద్ద క్యూలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు.
ఈ మార్పులతో పాటు టోల్ ఛార్జీల్లో కూడా పెంపు జరిగింది. సగటున 10% వరకు టోల్ రేట్లు పెరిగాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌వేల్లో 1.5% నుంచి 3.5% వరకు పెంపు అమలులోకి వచ్చింది. అలాగే, తరచూ ప్రయాణించే వాహనదారుల కోసం వార్షిక టోల్ పాస్ ధరను రూ.3,075గా నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు ముందుగానే తమ వాహనాలకు FASTag అమలు చేయించుకోవడం లేదా UPI సదుపాయం సిద్ధంగా ఉంచుకోవడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







