కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 2 ఔట్ లెట్ల మూసివేత

- April 28, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 2 ఔట్ లెట్ల మూసివేత

దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ రెండు ఔట్ లెట్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో 27 ఔట్ లెట్లకు హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ 19 నిబంధనలు పాటించని కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అథారిటీస్ వెల్లడించాయి. మొత్తం 2,384 ఎస్టాబ్లిష్మెంట్స్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. అల్ కరామాలో ఓ  సెలూన్ మూసివేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించని కారణంగా ఈ చర్య తీసుకున్నారు. కాగా, ఓ లాండ్రసీ షాప్ (నైఫ్ ప్రాంతంలో) ఆరోగ్యపరమైన వ్యక్తగత పరిశుభ్రత పాటించని కారణంగా మూసివేశారు. దుబాయ్ మునిసిపాలిటీ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com