ప్రారంభమైన వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. పోర్టల్ క్రాష్..
- April 28, 2021
న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో యూత్‌ను టార్గెట్ చేసింది మహమ్మారి.. ముఖ్యంగా 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల వయసు వారికి ఎక్కువగా కరోనా సోకుతుండడంతో...ఆ ఏజ్ గ్రూప్‌కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.ఇప్పటికే 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ అందించనున్నారు.అయితే, దీనికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.. http://www.cowin.gov.in వెబ్‌సైట్‌లో లేదా ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.. అయితే, రిజిస్ట్రేషన్ ప్రారంభంమైన కొద్ది సేపటికే కోవిన్, ఆరోగ్య సేతు అనువర్తనాలు మొరాయించాయి.. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎగబడడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
ప్రస్తుతం కోవిన్ సర్వర్ సమస్యలను ఎదుర్కొంటోంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి అని మెసేజ్ చూపిస్తోంది.. సమయం ముగిసే లోపాలు, 504 గేట్‌వే ఎర్రర్ కూడా వస్తుందని బాధితులు చెబుతున్నారు.. ఇక, ట్రాఫిక్ ప్రవాహానికి ప్రభుత్వం ఊహించి దానికి సిద్ధంగా లేకపోవడం ఏంటని.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.. ఇవాళే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. మే 1వ తేదీనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని.. కొంత సమయం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.. ఇక, రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. కొన్న రాష్ట్రాలు.. మే 1వ తేదీ నుంచే 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని.. వ్యాక్సిన్ కొరత కారణంగా.. కాస్త ఆలస్యంగా 18+ ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెబుతున్నాయి పలు రాష్ట్రాలు.ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. స్లాట్ కేటాయించే పరిస్థితి లేదని.. తొల ప్రియార్టీ.. 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోసు ఇవ్వడమే అంటున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







