రేపటి నుంచి పాస్పోర్ట్ సేవలు బంద్

- April 28, 2021 , by Maagulf
రేపటి నుంచి పాస్పోర్ట్ సేవలు బంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు పాస్‌పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి.కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్‌పోర్టు సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్‌పోస్టు సేవలను అందిస్తున్నది. తాజా నిర్ణయంతో ఇవన్ని గురువారం నుంచి మూతపడనున్నాయి.అలాగే రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో హైదరాబాద్‌లోని బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలీచౌకీ, నిజామాబాద్‌, కరీంనగర్‌  సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలను మాత్రమే నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.

విషయాన్ని గమనించి దరఖాస్తు దారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మే 14 తరువాత పరిస్థితులకు అనుగుణంగా పాస్‌పోర్టు సేవాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com