ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- May 14, 2026
న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విమాన సర్వీసులను భారీగా తగ్గించడంతో పాటు కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరగడం మరియు గగనతల ఆంక్షలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని సంస్థ వెల్లడించింది.
నిలిచిపోయిన 6 ప్రధాన అంతర్జాతీయ రూట్లు
ఆర్థిక భారానికి తోడు వాణిజ్యపరంగా లాభదాయకంగా లేని కారణంగా 6 ప్రధాన మార్గాల్లో సేవలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇందులో ఢిల్లీ-చికాగో, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్, ముంబై-ఢాకా మరియు ఢిల్లీ-మాలే రూట్లు ఉన్నాయి. ఈ మార్గాల్లో ఆగస్టు నెల వరకు విమాన సేవలు అందుబాటులో ఉండవని ఎయిర్ లైన్ స్పష్టం చేసింది.
కొనసాగనున్న కీలక విదేశీ సర్వీసులు కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గించినప్పటికీ, నెలకు 1,200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను నడుపుతామని సంస్థ తెలిపింది. దీని ప్రకారం ఉత్తర అమెరికాకు వారానికి 33, యూరప్‌కు 47, యూకేకు 57 విమానాలు నడుస్తాయి. అలాగే ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికా దేశాలకు నిర్ణీత సంఖ్యలో సర్వీసులను కొనసాగించనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







