ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న సీఎం చంద్రబాబు
- May 14, 2026
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు. అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకున్నారు.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







