ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్‌ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- May 14, 2026
దోహా: దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్‌వర్క్‌లలో కనిపించని వైకల్యాలున్న ప్రయాణికుల కోసం సన్‌ఫ్లవర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ 'హిడెన్ డిసేబిలిటీస్ సన్‌ఫ్లవర్ ప్రోగ్రామ్' తమకు కనిపించని వైకల్యం ఉందని ప్రయాణికులు స్వచ్ఛందంగా, సులభంగా తెలియజేయడానికి ఒక పొద్దుతిరుగుడు పువ్వు సింబల్ ను ఉపయోగిస్తుంది.
గత సంవత్సరం విజయవంతమై సానుకూల స్పందన పొందిన 'బెస్ట్ బడ్డీస్' కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖతార్ రైల్ ఒక ప్రకటనలో తెలిపింది.
కస్టమర్ సర్వీస్ బృందాలు సన్‌ఫ్లవర్ చిహ్నాన్ని గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందాయని, కనిపించని వైకల్యాలు ఉన్న ప్రయాణికులకు శ్రద్ధతో సహాయం చేయడానికి వారు పూర్తిగా సన్నద్ధమై ఉంటారని పేర్కొంది.
ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఖతార్ రైల్ పునరుద్ఘాటించింది. సన్‌ఫ్లవర్‌ను ధరించడం ద్వారా ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో ప్రయాణిస్తున్నప్పుడు తమకు మరింత సమయం, అదనపు మద్దతు అవసరమని సైలెంట్ గా తెలియజేయవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!
- తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ సేవలకు కొత్త టెండర్.. ఆపరేటర్ మారే అవకాశం..!!
- ఖతార్‌లో ఆన్లైన్ బ్లాక్‌మెయిల్‌పై కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస ఉద్యోగులకు కొత్త వెసులుబాటు..!!
- యాస్మిన్ పాస్ వద్ద మూడు ట్రక్కులు ఢీ..!!
- దుబాయ్‌లో 22 మంది బెగ్గర్స్ ముఠా అరెస్ట్..!!
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’







