భార‌త్ కు బాస‌ట‌గా నిలిచిన బాప్స్ హిందూ మందిర్‌

- April 29, 2021 , by Maagulf
భార‌త్ కు బాస‌ట‌గా నిలిచిన బాప్స్ హిందూ మందిర్‌

అబుధాబి: కోవిడ్ తో ప్ర‌పంచ దేశాలు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాయి. వైర‌స్ ఎప్ప‌టిక‌ప్పుడు రూపాంత‌రం చెందుతూ మ‌రింత జ‌ఠిలంగా మారుతుండ‌టంతో సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. భార‌త్ లో వైర‌స్ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని...ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ దేశాల్లోని ప్ర‌వాస భార‌తీయులు త‌మ మాతృదేశానికి అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అబుధాబి బాప్స్ హిందూ మందిర్ చైర్మ‌న్ స్వామి బ్ర‌హ్మ‌విహారిదాస్ పిలుపునిచ్చారు. కోవిడ్ సంక్షోభ ప‌రిస్థితుల్ని ఎదుర్కొవ‌టంలో భార‌త్ కు పూర్తి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌తామ‌ని యూఏఈ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. యూఏఈ ప్రభుత్వ నిర్ణ‌యానికి అనుగుణంగా ఇక్క‌డి ప్ర‌వాస భార‌తీయులు కూడా మాతృదేశానికి సాయం చేసేందుకు పెద్ద సంఖ్య‌లో స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. త‌మ వంతుగా బాప్స్ హిందూ మందిర్ త‌ర‌పున భార‌త్ కు నెల‌కు 440 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వం, బాప్స్ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న కోవిడ్ ఆస్ప‌త్రుల ద్వారా నిరుపేద‌లు ల‌బ్ధిపొందేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. త‌మ ల‌క్ష్యానికి అనుగుణంగా తొలి వారం 44 మెట్రిక్ ట‌న్నుల ద్ర‌వ ఆక్సిజ‌న్‌, 600 ఆక్సిజ‌న్ సిలండ‌ర్లు పంపిస్తున్న‌ట్లు వివ‌రించారు. ట్రాన్స్ వ‌ర‌ల్డ్ గ్రూప్ స‌హ‌కారంతో విమాన‌, ప‌డ‌వ‌ల ద్వారా భార‌త్ కు ఆక్సిజ‌న్ పంపిస్తున్న‌ట్లు స్వామి వెల్ల‌డించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com