భారత్ లోని అమెరికన్లను వెనక్కు వచ్చేయండి అంటూ హెచ్చరిస్తున్న అగ్రరాజ్యం..
- April 29, 2021
భారత్‌పై కరోనా విరుచుకుపడుతున్నది. ప్రతిరోజు మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అక్కడ దవాఖానలు నిండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పౌరులెవరూ భారత్ వెళ్లకండి. అక్కడ ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా తిరిగి వచ్చేయండి అంటూ.. హెచ్చరించింది.
అమెరికాకు ప్రతిరోజు ఇండియా నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని, యూరప్ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటిద్వారా స్వదేశానికి చేరుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ లెవల్ ఫోర్ ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది. ఈవారం ప్రారంభంలో భారత్‌కు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి బ్రిటన్‌కు వచ్చేవారు తప్పనిసరిగా 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే అని ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







