ఉత్తరాఖండ్ ప్రభుత్వ కీలక నిర్ణయం..చార్ ధామ్ యాత్ర రద్దు..
- April 29, 2021
కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ.. ప్రాణాంతకంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నాలుగు ఆలయాల్లో కేవలం పూజారులకు మాత్రమే అనుమతి ఉందని… వారే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. మే 14 నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో కూడా కుంభమేళాను నిర్వహించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. గురువారం ప్రత్యేకంగా సమావేశమై చార్‌ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. కుంభమేళా కారణంగా ఉత్తరాఖండ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 1న 2200 కేసులు రాష్ట్రంలో ఉండగా.. అవికాస్తా బుధవారం నాటికి 45 వేలకుపైగా కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







