భళా అనిపిస్తున్న 'బాహుబలి' ట్రైలర్
- June 01, 2015
దర్శక ధీరుడు రాజమౌళి రెండు ఏళ్ళగా ఎంతో కష్టపడి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలోని మొదటి భాగం జూలై10న విడుదలవుతుంది. అంతకన్నా ముందు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ ఉదయం 10:30కు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లోని 300కి పైగా థియేటర్లలో బాహుబలి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చుసిన అబిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ట్రైలర్ మొదటిగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని తెలుసుకున్న అబిమానులు మార్నింగ్ నుండే థియేటర్స్ దగ్గర లైన్లు కట్టారు విజువల్ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి ట్రైలర్‌ను చూసినవారంతా అద్భుతమైన రెస్పాన్స్ కనుపరుస్తున్నారు. ప్రభాస్, రానాల స్టన్నింగ్ లుక్స్, రాజమౌళి మార్క్ టేకింగ్, ఎమ్.ఎమ్.కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో బాహుబలి ట్రైలర్ సూపర్బ్ అనిపించుకుంది. ఇక "నన్నెప్పుడూ చూడని కళ్ళు దేవుడిలా చూస్తున్నాయి.. నేనేవర్ణి?" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌కు అబిమానుల ఈలలతో ధియేటర్ లలో మారుమోగిపోయాయి. రెండు నిమిషాల ట్రైలరే ఈ స్థాయి అనుభూతి కలిగిస్తే, ఇక పూర్తి సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందోనని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







