త్వరలో విడుదల కానున్న 'కేరింత'
- June 01, 2015
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ చిత్రాన్ని జూన్12 న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "కొత్త బంగారులోకం' సినిమా తరువాత తక్కువ బడ్జెట్ లో కొత్తవాళ్ళతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాం. 'కేరింత' స్టొరీ సాయి చెప్పగానే నాకు నచ్చి ఓకే చెప్పాను. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నిజమైన స్నేహం, ప్రేమ అంశాలతో సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు. దర్శకుడు సాయికిరణ్ అడవి మాట్లాడుతూ "సినిమా కంప్లీట్ అవ్వడానికి ప్రతి టెక్నీషియన్ ఎంతగానో సహకరించారు. అందరు ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. మిక్కి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. జూన్ 12న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్న ఈ సినిమా అందరిని అలరిస్తుందని భావిస్తున్నాను" అని చెప్పారు. సంగీత దర్శకుడు మిక్కి జె మేయర్ మాట్లాడుతూ "రామజోగయ్యశాస్త్రి గారు మంచి సాహిత్యాన్ని అందించారు. సినిమాలో పాటలు అధ్బుతంగా వచ్చాయి" అని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







