గుజరాత్ కోవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం..
- May 01, 2021
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.భారుచ్‌లోని పటేల్ వెల్ఫేర్ కొవిడ్ హాస్పిటల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 18 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు.కోవిడ్ వార్డులో చికిత్స తీసుకుంటున్న 12 మంది రోగులు మంటలు అంటుకొని, భారీగా వ్యాపించిన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారని భారుచ్ ఎస్పీ రాజేంద్ర సింహ్ తెలిపారు. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు.

భారుచ్-జంబుసర్ రహదారిపై ఉన్న నాలుగు అంతస్థుల భవనంలో హాస్పిటల్ ఉండగా.. దీన్ని ఓ ట్రస్ట్ నిర్వహిస్తోంది.గ్రౌండ్ ఫ్లోర్‌లోని కొవిడ్ వార్డులో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్ సంసియా తెలిపారు.గంటలోపు మంటలు అదుపులోకి తీసుకువచ్చామని, సుమారు 50 మంది రోగులను, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని పేర్కొన్నారు.వారందరినీ సమీపంలో ఉన్న హాస్పిటల్స్‌కు తరలించినట్లు వివరించారు. అయితే మంటలు చెలరేగేందకు ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







