9 మిలియ‌న్ల డోసుల‌ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి

- May 01, 2021 , by Maagulf
9 మిలియ‌న్ల డోసుల‌ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి

సౌదీ: కింగ్డ‌మ్ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 9 మిలియ‌న్ల డోస‌లు మేర వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్తంగా 587 కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా వివ‌రించింది. ప్ర‌జ‌లంద‌రు స్వ‌చ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సినేష‌న్ ప్రోగ్రాంలో పాల్గొనాల‌ని...కోవిడ్ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డంలో త‌మ‌వంతు స‌హ‌కారం అందించాల‌న్నారు. ఇదిలాఉంటే..రంజాన్‌, ఈద్ అల్ ఫిత‌ర్ పండ‌గ‌ల స‌మ‌యంలో వైర‌స్ ఉద్ధృతి పెరిగే అవ‌కాశాలు, క‌ర్ఫ్యూ విధించాల్సిన అవ‌స‌రాలు ఉన్న‌ట్లు త‌మ‌కు ఎలాంటి నివేదిక‌లు అంద‌లేద‌ని ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com