భారత్‌కు బోయింగ్ భారీ సాయం
- May 01, 2021
అమెరికా: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతోంది. దీంతో దాదాపు ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని చోట్ల ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. దీంతో కరోనా పోరులో భారత్‌ను ఆదుకునేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా భారత్‌కు అమెరికాకు చెందిన ఏరోస్పెస్ దిగ్గజ సంస్థ బోయింగ్ అండగా నిలిచింది. భారీ సాయాన్ని ప్రకటించింది. 10 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజిని అందించనున్నట్లు ప్రకటించింది.అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.74 కోట్లకు పై మాటే.
మహమ్మారిపై పోరాడుతున్న వారికి వైద్య పరికరాలు అందించడం సహా ఇతర కార్యక్రమాలు చేపడుతున్న భారత్‌లోని సంస్థలకు ఈ సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. అలాగే బోయింగ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమవంతు సాయంగా వ్యక్తిగతంగా విరాళాలు అందించాలని బోయింగ్ సంస్థ సీఈఓ డేవ్ కల్హౌన్ కోరారు. ఉద్యోగి ఇచ్చిన విరాళానికి అంతే మొత్తాన్ని జమ చేసి సహాయంలో సంస్థ కూడా భాగమవుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా వల్ల ఏర్పడిన దయనీయ పరిస్థితుల మార్పునకు ఇది తమ వంతు సాయం అని చెప్పారు. మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నంలో బోయింగ్ భారతీయ ప్రజలకు సంఘీభావంగా నిలబడడమే కాకుండా.. సమస్య పరిష్కారంలో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







