ఊర్మిళకు గురువారం వివాహం జరిగింది...

- March 03, 2016 , by Maagulf
ఊర్మిళకు గురువారం వివాహం జరిగింది...

బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (42) కు కశ్మీరీ వ్యాపారవేత్త, మోడల్ మొహసిన్ అక్తర్‌తో గురువారం వివాహం జరిగింది. ముంబైలోని ఊర్మిళ ఇంట్లో హిందూసాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. రంగీలా, సత్య, భూత్, ప్యార్ తూనే క్యాకియా వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో ఓ ఊపుఊపిన పెద్దగా ఆర్భాటం లేకుండా, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బాలీవుడ్ నుంచి డిజైనర్ మనీష్ మల్హోత్రా ఒక్కరే ఈ పెళ్లికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com